హైకోర్ట్ కి వెళ్ళాడని రైతుని గ్రామం నుంచి బహిష్కరించారు…!

నిజామాబాద్ జిల్లాలో ఒక గ్రామంలో రైతుని గ్రామం నుంచి బహిష్కరించారు. చెరువు శిఖం భూమిలో రైతు భవనం నిర్మాణంపై అభ్యంతరం తెలుపుతూ హై కోర్టులో కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ లో ఓ రైతు కేసులో వేసారు. ఆయన పేరు చిలుకూరి బాజన్న… తమ మాట వినకుండా, తమ నిర్ణయానికి వ్యతిరేకంగా కేసు వేసాడు అని సామాజిక బహిష్కరణ చేస్తూ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.

దీనిపై బాజన్న మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసాడు. రైతుల క్షేమం కోసమే చెరువు స్థలంలో భవన నిర్మాణం వద్దంటున్నానని అతను పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని మీడియాకు వేడుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు జోక్యం చేసుకుని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే తాను కేసు విత్ డ్రా చేసుకోలేను అని చెప్తున్నాడు.