కాంగ్రెస్ లో విభేదాలకు కొత్త పరిష్కారం కనిపెట్టిన ఠాగూర్…!

-

తెలంగాణ కాంగ్రెస్ లో అంతా సీనియర్లే. ఎవరికి వారు తమ వ్యూహం అమలు చేసుకునే వాళ్లే. పైకి అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం ఎవరి దారి వారిది. కాంగ్రెస్ కి బలం అదే.. బలహీనత కూడా అదే. కానీ కొత్త ఇంఛార్జి దీనికో పరిష్కారం చూపించారు.కలహాల కంటే.. కలిసి పని చేస్తే నే బలం అని నమ్ముతున్నారు ఇంఛార్జి ఠాగూర్. ఇంఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన నటి నుండి..నాయకుల ఐక్యమత్యం గురించి పదే పదే చెప్తున్నారు. నాయకులు కలిసి పని చేస్తే 2023 లో అధికారం మనదే అంటూ క్లాస్ లు ఇస్తున్నారు ఠాగూర్. అయితే నాయకులకు మాటలు చెప్పడమే కాదు..మాటలను ఆచరణలో పెట్టడం ముఖ్యమని భావించారు.


సీనియర్ నాయకులు అంతా ఒకే తాటిమీదకు వచ్చారన్న సంకేతం పంపేలా దుబ్బాక ఉప ఎన్నికను వాడారు ఠాగూర్. సీనియర్ నాయకులు కూడా మండలాల బాధ్యత అప్పగించి అందరిని పనిలో పెట్టారు. లోపల ఎంత కోపం ఉన్నా.. కలిసి మాట్లాడుకుంటే..కలిసి భోజనం చేస్తే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు ఠాగూర్. దింతో దుబ్బాక ఎన్నికలు ముగిసిన వెంటనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ ఇంట్లో పార్టీ నాయకులకు విందు భోజనం చేయించారు. పార్టీ ముఖ్య నాయకులందరిని పిలిచారు.

ఇక మరుసటి రోజు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఉదయం టిఫిన్..మధ్యాన్నం కోర్ కమిటీ సమావేశం తర్వాత భోజనం కూడా పెట్టారు. దీనికి జానారెడ్డి.. రేవంత్ లు కూడా హాజరయ్యారు. సిఎల్పీ నేత భట్టి కి..రేవంత్ మధ్య కొంత గ్యాప్ ఉంది. అయినా.. భట్టి ఇంటికి రేవంత్ వెళ్లారు. ఇలా పార్టీలో నాయకుల మధ్య విందు భోజనం..కలిసి పోవడానికి వేదికగా మలుచుకునే పనిలో పడ్డారు ఠాగూర్. విందు రాజకీయం వర్కౌట్ అవుతోంది లేదో కానీ..ఓ ప్రయత్నం అయితే మొదలయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news