జేఎన్‌టీయూకు ఏ ప్లస్‌ గ్రేడ్‌.. ధ్రువీకరించిన న్యాక్‌ బృందం

-

జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి జాతీయ స్థాయిలో న్యాక్‌ గుర్తింపు, ఏ ప్లస్‌ గ్రేడ్‌ దక్కింది. న్యాక్‌ (నేషనల్‌ అసెస్‌మెంట్‌, అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌) బృందం సభ్యులు శనివారం రోజున అధికారికంగా ఏ ప్లస్‌ గ్రేడ్‌ను ప్రకటించారు. గత ఏడాది ఏ గ్రేడ్‌ మాత్రమే వచ్చింది. దీంతో జేఎన్‌టీయూ అధికారులు అప్పీలుకు వెళ్లారు. 90 వేల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థుల భవిష్యత్‌పై ఈ గ్రేడింగ్‌ ప్రభావం చూపనుందని దరఖాస్తులో పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంపై నివేదిక పంపారు.

అధికారులు నివేదిక పంపిన తర్వాత ఇటీవల జేఎన్‌టీయూ హైదరాబాద్‌ను న్యాక్‌ బృందం సభ్యులు సందర్శించారు. పరిశోధన వివరాలు గమనించిన బృందం ఏ ప్లస్‌ గ్రేడ్‌ను ప్రకటించింది. దీనిపై జేఎన్టీయూ వీసీ కట్టా నరసింహారెడ్డి ఆచార్యుల బృందాన్ని అభినందించారు. రాబోయే సంవత్సరంలో ఏ ప్లస్‌ ప్లస్‌ గ్రేడ్‌ సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. మరోవైపు యూనివర్సిటీకి ఏ గ్లస్ గ్రేడ్ దక్కడంపై ఇటు ప్రొఫెసర్లు, లెక్చరర్లు, మరోవైపు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news