మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మున్సిపాలిటీలో టాక్సీల రూపంలో వసూలు చేసిన సొమ్మును ప్రభుత్వ అకౌంటులో జమ చేయకుండా, బిల్ కలెక్టరు, ప్రజా ప్రతినిధులు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు తెరపైకి వచ్చాయి. అయిదు రోజులుగా నగదు గల్లంతపై మున్సిపాలిటీలో స్పెషల్ ఆడిటింగ్ జరుగుతున్న నోరు మెదపటం లేదు ప్రజా ప్రతినిధులు, కమిషనర్. ఇదే మున్సిపాలిటీలో మూడు అయిదు రోజుల క్రితం ఓ బిల్ కలెక్టర్ అదృశ్యం అయ్యారు.
అధికార పార్టీ ప్రజా ప్రతినిధి సహకారంతో నిధులను పక్కదారి పట్టించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా మున్సిపాలిటీలో జరుగుతున్న ఆడిటింగ్‌తో వెలుగులోకి వచ్చిన ఘటన, కప్పిపుచ్చేందుకు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పైరావీలు జరిగినట్లు తెలుస్తోంది. ఘట్కేసర్ మున్సిపాలిటీలో 18 వార్డులు ఉండగా ఏడుగురు బిల్ కలెక్టర్‌లు మున్సిపాలిటీ పరిధిలోని బిల్లులు వసూలు చేస్తు విధులు నిర్వహిస్తుంటారు..వీరిలో ఒకరు మున్సిపాలిటీ కార్యాలయంలోనే ఉంటూ వసూలు చేసిన బిల్లులను ట్రెజరీలో జమ చేయాల్సి ఉండగా, ట్రెజరీలో జమ చేయకపోవడంతో అక్రమాలు జరిగినట్లు గుర్తించారు ఆధికారులు. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.