చెన్నై-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇప్పుడు ఈ ఘోర ప్రమాదం వీడియో వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నడిరోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు క్రాస్ చేస్తుండగా ప్రైవేటు బస్సును ఢీకొట్టింది ఓ కంటైనర్.
అయితే.. ఆ కంటైనర్ ఢీకొట్టడంతో బోల్తా పడింది బస్సు. ఈ ప్రమాదంలో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.. మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. చెన్నై-బెంగళూరు హైవేపై జరిగిన శ్రీపెరంబదూర్ వద్ద జరిగిన ఈ ఘటన వీడియో వైరల్ గా మారింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఘోర రోడ్డుప్రమాదం
చెన్నై – బెంగళూరు హైవేపై ఈరోజు తెల్లవారుజామున ఓ ప్రైవేట్ కంపెనీ బస్సును ఢీకొట్టిన లారీ
బస్సు కింద పడ్డ పాదచారి.. దాదాపు 10 మందికి పైగా తీవ్రగాయాలు pic.twitter.com/9jZL2q6yCc
— Telugu Scribe (@TeluguScribe) December 10, 2024