ఇప్పటికైనా ముసుగు తీయండి..అంటూ చంద్రబాబుపై షర్మిల ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాం. కడప స్టీల్ పై మీ వైఖరి ఏంటి ? కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ప్రకటనకు మీరిచ్చే సమాధానం ఏంటి ? అని ప్రశ్నించారు. అసలు కేంద్రం పరిశీలనలో లేదనడం మీరు సమర్ధిస్తారా ? కడప స్టీల్ ప్లాంట్ కడతారా ? కట్టరా? ఇప్పటికైనా స్టీల్ ప్లాంట్ పై మీ ముసుగు తీయండి సార్ అంటూ చురకలు అంటించారు.
అనాడు బీజేపీ మోసం చేసిందని, కేంద్రం సహకరించక పోయినా.. రాష్ట్ర ప్రభుత్వమే ప్లాంట్ కడుతుందని ఒకసారి మీరు కొబ్బరి కాయ కొడితే… రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ఉండాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ రెండు సార్లు టెంకాయలు కొట్టారని గుర్తు చేశారు. నాలుగు సార్లు శంకుస్థాపన జరిగి ఒక్క అంగుళం కూడా ముందుకు కదలని ప్రాజెక్టు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది కడప స్టీల్ మాత్రమే అన్నారు.
చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. కేంద్రంలో బీజేపీ మూడో సారి అధికారంలో ఉందంటే మీ మద్దతు తోనే. మీకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే, మోడీ ఇచ్చిన పదవులు ముఖ్యం కాకపోతే, విభజన హక్కు ప్రకారం కడప స్టీల్ ను కేంద్రం నిర్మించి ఇచ్చేలా ప్రకటన చేయించండి. అంటూ డిమాండ్ చేశారు షర్మిల.