శ్రీశైలంలో స్నానానికి దిగి.. వరద నీటిలో వ్యక్తి గల్లంతు..!

-

కర్ణాటక రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం వద్ద కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది.  తాజాగా శ్రీశైలంలో  అధికారులు మరో రెండు గేట్లను ఎత్తారు. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా శ్రీశైలం డ్యామ్ నీటి ప్రవాహం చూసేందుకు భారీగా తరలివస్తున్నారు జనాలు. దీంతో  కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అవుతోంది. కొంత మంది యువకులు అయితే వాటర్ వద్ద సెల్పీలు దిగేందుకు ప్రమాదకరంగా ప్రవర్తిస్తున్నారు.

ఈ తరుణంలోనే శ్రీశైలంలో స్నానానికి దిగి.. వరద నీటిలో వ్యక్తి గల్లంతు అయ్యాడు.  నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న లింగాల గట్టు పెద్ద బ్రిడ్జ్ కింద ఓ యాత్రికుడు అందరు చూస్తుండగానే వరదనీటిలో కొట్టుకుపోయాడు. శ్రీశైలం స్వామివారి దర్శనానికి వచ్చి లింగాలగట్టు సమీపంలోని పెద్ద బ్రిడ్జ్ కింద స్నానానికి ఓ వ్యక్తి దిగాడు. అయితే వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో నీటిలో కొట్టుకుపోయాడు. సదరు వ్యక్తి నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యాదయ్యగా  గుర్తించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news