డేంజర్‌ లో హైదరాబాద్..మొత్తం 1,101 డెంగీ కేసులు నమోదు !

-

డేంజర్‌ లో హైదరాబాద్ నగరం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దీ నెలలుగా జ్వరాలు నమోదు అవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెల నుంచి ఆగస్టు 1st వరకు 2 వేల 847 డెంగీ కేసులు నమోదు అయినట్లు అధికారులు ప్రకటించారు. ఇక ముఖ్యమంగా హైదరాబాద్ లో మొత్తం 1,101 డెంగీ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు అధికారులు. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా డెంగీ కేసులు హైదరాబాద్ లోనే కావడం గమనార్హం.

A total of 1,101 dengue cases have been registered in Hyderabad

హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలో 287 డెంగీ కేసులు నమోదయ్యాయని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత మేడ్చల్ జిల్లాలో 268 డెంగీ కేసులు రిపోర్ట్ అయ్యాయన్నారు. సూర్యాపేటలో 217 నల్లగొండలో 186, రంగారెడ్డిలో 156, నిజామాబాద్ లో 112 డెంగీ కేసులు నమోదైనట్టు అధికారిక గణాంకాలు చెప్పారు. మిగతా జిల్లాల్లో కూడా పదుల సంఖ్యలో డెంగీ కేసులు రికార్డ్ అయ్యాయన్నారు. ఇవికాక వైరల్, సీజనల్ ఫివర్లు.. శ్వాస సంబంధిత వ్యాధులు, డయేరియా కేసులు కూడా నమోదు అవుతున్నాయని అధికారులు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news