వారికి ఓటేయండి.. వైరల్ గా మారిన వెడ్డింగ్ కార్డు..!

-

దేశంలో ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సెగ శుభకార్యాలకు సైతం తాకుతోంది. శుభకార్యాలకు నలుగురు కలిసి రావడం.. ముచ్చట్లు పెట్టుకోవడం ఆతిథ్యం స్వీకరించడం వంటివి మామూలే. అంతేకాదు ఇలాంటి కార్యక్రమాల్లో పలు పార్టీల నేతలు కలుసుకోవడం కూడా సహజమే. అయితే, ఈ మధ్య కాలంలో పెళ్లి శుభలేఖల్లో తమ అభిమాన నటులు లేదా రాజకీయ నేతలు ఫొటోలు ముద్రించడం కామన్ గా మారింది. ముఖ్యంగా ఫ్లెక్సీలు వేయించడం ముఖ్యంగా మాకు గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదుకానీ.. మీ ఓటు మాత్రం ఫలానా నేతకే వేయండంటూ అభిమానులు ప్రచారం చేసేస్తున్నారు.

సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీకి ఓటేయండి అదే మాకు గిఫ్ట్ అంటూ ఓ ఇంటి వారు పెళ్లి కార్డుపై ముద్రించడం వైరల్ గా మారింది. ఆరుట్ల గ్రామంకు చెందిన సాయికుమార్, మహిమ రాణికి ఏప్రిల్ 4న వివాహం నిశ్చయించారు. వారి పెళ్లి కార్డును వినూత్నంగా ప్రింట్ చేయించారు. ‘నా పెళ్లికి మీరు ఇచ్చే బహుమతి.. ప్రధాని మోడీకి మీరు వేసే ఓటు’ అంటూ ముద్రించారు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది చూసిన నెటిజన్లు వీరి అభిమానం తగిలేయ్య అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news