తెలంగాణ ఎమ్మెల్యేకు మహిళ న్యూడ్ వీడియో కాల్?

-

తెలంగాణ రాష్ట్రంలోని ఓ పార్టీ ఎమ్మెల్యేకు… ఊహించని షాక్ తగిలింది. ఆ ఎమ్మెల్యేకు… అర్ధరాత్రి ఓ మహిళ న్యూడ్ కాల్ చేసిందట. న్యూడ్ వీడియో కాల్ చేసి… రచ్చ చేసిందని తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు… న్యూడ్ కాల్ రావడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.  

ఈనెల 14వ తేదీన అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని నెంబర్ నుంచి… ఓ మహిళ ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఫోన్ లిఫ్ట్ చేయగానే… ఓ మహిళ నగ్నంగా కనిపించిందని… సదరు ఎమ్మెల్యే చెబుతున్నారు. వీడియో కాల్ రిసీవ్ చేసుకోగానే… ఆందోళనకు గురయ్యారట ఎమ్మెల్యే. అనంతరం వెంటనే ఫోన్ కాల్ కట్ చేశారట. అయితే ఈ వీడియో కాల్ వెనుక ప్రత్యర్థి పార్టీ నేతలు ఉన్నారని.. సదరు ఎమ్మెల్యే చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడట.

Read more RELATED
Recommended to you

Latest news