ఇన్ స్టాగ్రామ్ ప్రేమ..”నువ్వు లేక లేను” అంటూ ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఇన్స్టా గ్రామ్ లో యువకుడి వేధింపులతో యువతి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీహరి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దుండిగల్ పరిది బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
తేజస్విని ఆత్మహత్య తర్వాత.. సూసైడ్ అటెంప్ట్ చేశాడు శ్రీహరి. భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు శ్రీ హరి. సురారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ పరారయ్యాడు శ్రీహరి. సూసైడ్ నోట్ రాసిన శ్రీహరి ..తేజు నీ దగ్గరికే వస్తున్న.. నువ్వు లేని లోకంలో నేను ఉండలేను అని తెలిపాడు. ఈ మేరకు నోట్ రాసిన శ్రీహరి…దుండిగల్ పరిది బహుదూర్ పల్లి సాయినాథ్ సొసైటీలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.