హరీశ్ రావు వ్యాఖ్యల పట్ల మంత్రి తుమ్మల భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు

-

తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో అవమానాలను ఎదుర్కున్నానని.. మాజీ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యల పట్ల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాజాగా ఖమ్మంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కాలం నుంచి మంత్రిగా ఉంటూ ఖమ్మం జిల్లాకు మేలు చేసేందుకు ప్రయత్నించానని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచే గోదావరి పారుతున్నప్పటికీ.. ఆ జలాలు ఈనెలను తడపలేదన్నారు. తొలుత నుంచి జిల్లాలో మొత్తం భూమికి నీళ్లు ఇవ్వాలన్నదే తన సంకల్పమని పేర్కొన్నారు.

తాను మంత్రిగా ఉన్న ప్రతీ సారి ముఖ్యమంత్రులతో మాట్లాడి తన ప్రయత్నాలు తాను చేసినట్టు గుర్తు చేశారు మంత్రి తుమ్మల. ఖమ్మం జిల్లా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో నీళ్ల కోసం పార్టీ మారానని గుర్తుకు చేశారు. గత ప్రభుత్వం జిల్లాలో తలపెట్టిన ప్రాజెక్ట్ పనులను పట్టించుకోలేదని ఆరోపించారు. రాహుల్ గాంధీ కోరిక మేరకు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరానని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేటప్పుడు కూడా ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధిష్టానానికి తెలిపినట్టు వివరించారు. ముఖ్యంగా సీతారామ ప్రాజెక్ట్ విషయంలో క్రెడిట్ కోసం తాను ప్రయత్నిస్తున్నానని హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని ఎమోషనల్ అయ్యారు. 

Read more RELATED
Recommended to you

Latest news