BREAKING: ఘట్కేసర్ లో దారుణం.. బ్రిడ్జిపై నుండి దూకిన యువతి

-

BREAKING: ఘట్కేసర్ లో దారుణం చోటు చేసుకుంది. బ్రిడ్జిపై నుండి దూకింది ఓ యువతి. ఈ సంఘటన సోమవారం ఉదయం 11 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఘట్కేసర్ పరిధిలోని వరంగల్ హై వే లో ఉన్న బ్రిడ్జిపై నుండి దూకింది ఓ యువతి. విజ్ఞాన్ భారతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది ఆ యువతి నాగమణి.

A young woman jumped from the bridge

ఆత్మహత్య యత్నం చేసుకున్న యువతి పేరు నాగమణి కాగా.. ఆమె వయస్సు 18 సం “లు.
విద్యార్థిని నాగమణి స్వస్థలం జనగామ గుర్తించారు. అయితే… ఈ ప్రమాదం జరిగిన వెంటనే… యువతి నాగమణిని ఆస్పత్రికి తరలించారు. ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది విద్యార్థి నాగమణి. నాగమణి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయానని ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news