Leopard movement seen again in Shamshabad: శంషాబాద్ లో చిరుత కదలికలు మళ్లీ కనిపించాయి. నిన్న ఘాన్సీమియాగుడా గ్రామంలోని వ్యవసాయ పొలంలో కనిపించాయి చిరుత కదలికలు. నేడు శంకరాపురం వద్ద సిసి కెమెరాల్లో చిరుత కదలికలు కనిపించాయి. జిసిసి కెమెరాల క్లారిటి సరిగ్గా లేకపోవడం వల్ల చిరుతా లేదంటే ఇంకా ఏదైనా జంతువా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
దీంతో రెండు రోజులుగా గాలిస్తున్నారు అటవి శాఖ అధికారులు. చిరుత అయి ఉండకపోవచ్చు హైనాగా అనుమానిస్తున్నారు అటవి శాఖ అధికారులు. కానీ శంషాబాద్ లో చిరుత కదలికలు మళ్లీ కనిపించాయని స్థానిక ప్రజలు అయితే… ఆందోళన చెందుతున్నారు. అయితే.. ఈ చిరుత కోసం గాలిస్తున్న సమయంలో దానికి ఎరగా 5 మేకలను బోను వద్ద ఉంచారు అటవీ శాఖ అధికారులు.