హైదరాబాద్‌ లో దారుణం..యువతి నోట్లో గుడ్డలు పెట్టి అత్యాచారం

-

హైదరాబాద్‌ లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్ లిఫ్ట్ లో యువతిని భవనంపై అంతస్తు తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు లిఫ్ట్ ఆపరేటర్. డైట్ సెక్షన్ లో ఫ్లోర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ మేరకు అత్యాచారం అయినట్టు నిర్ధారించారు ఈ ఎస్ ఐ హాస్పిటల్ డాక్టర్లు.

కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆ బాధిత యువతి కుటుంబం వైద్యం కోసం ESI ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. వారం రోజుల నుంచి ESI ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు యువతి అన్నయ్య. తన అన్నయ్య బాగోగులు చూసుకుంటోంది ఆ యువతీ. ఈ తరుణంలోనే అదును చూసి యువతి లిఫ్ట్ లో వస్తున్న సమయంలో పైకి తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు గుక్కి అత్యాచారం చేశాడు లిఫ్ట్ ఆపరేటర్. అనంతరం తప్పించుకొని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది యువతీ. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news