మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌కు సన్ స్ట్రోక్ తగిలేలా ఉంది. బీఆర్ఎస్ పార్టీ వీడి అభినవ్ భాస్కర్..బీజేపీలో చేరనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు సోమవారం హన్మకొండ రెడ్డి కాలనీ లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన ఆత్మీయల సమ్మేళనం కార్యక్రమంలో వినయ్ భాస్కర్ ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి ప్రణయ్ భాస్కర్ తనయుడు, 60వ డివిజన్ కార్పొరేట్ ర్ దాస్యం అభినవ్ భాస్కర్. వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కోసం చాలా త్యాగాలు చేసామని.. అయినా మా బాబాయ్ దగ్గర తమకు గుర్తంపు లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు అభినవ్ భాస్కర్.
1998లో తన తండ్రి మరణించిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్లో అప్పుడు పార్టీ తన తల్లిని ఎన్నికల్లో పోటీ చేయాల్సిందిగా కోరగా తన మరిది దాస్యం వినయ్ భాస్కర్‌కు అవకాశం కల్పించాలని ఆనాడు తన తల్లి త్యాగం చేసిందని వివరించారు. 2023 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తనకు పరకాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానన్న తమ కుటుంబంలో కలహాలు వస్తాయని మా బాబాయ్ కోసం పని చేశానని స్పష్టం చేశారు అభినవ్ భాస్కర్. వినయ్ భాస్కర్ చుట్టూ ఉండే నలుగురు వ్యక్తుల మాటలు నమ్మి తన ఓటమికి అభినవ్ భాస్కర్ కూడా కారణమని చెప్పడం నన్ను కలిసి వేసిందని తెలిపారు. ఆత్మగౌరవం లేని చోట నేను ఉండలేను. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానన్నారు దాస్యం అభినవ్ భాస్కర్.