బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు ఆది శ్రీనివాస్. గత పదేళ్లలో బీఆర్ఎస్ దోచుకున్నది ఎంతో తేలుతుందనే కొత్త ప్రభాకర్ అలా మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేసారు. బీఆర్ఎస్ నాయకులు పడగొడితే పడిపోయే ప్రభుత్వం కాదని వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి కుట్రపూరిత వ్యాఖ్యలపై న్యాయ విచారణ జరపాలని సీఎం రేవంత్‌ని కోరుతామని చెప్పారు ఆది శ్రీనివాస్.

బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈర్ష్య ఎందుకు? అన్నారు ఆది శ్రీనివాస్. అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలనే కోరుకుంటున్నారని వెల్లడించారు. ప్రజల్లోంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డిని శాపనార్థాలు పెడుతున్నారు.. మరో ఐదేళ్లు కూడా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నాలుగు అంశాలే ప్రధాన ఎజెండాగా సీఎల్పీ సమావేశం అని చెప్పారు ఆది శ్రీనివాస్. ఇందిరమ్మ ఇండ్లు, సన్నబియ్యం, భూ భారతిని ప్రజలలోకి ఎలా తీసుకువెళ్లాలనే అంశాలని చర్చిస్తామని పేర్కొన్నారు.