విదేశాల నుంచి ఇంటికి వస్తూ.. దారి మధ్యలోనే గుండెపోటుతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

గుండెపోటుతో బస్సులోనే కుప్పకూలింది ఓ మహిళ. మస్కట్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుంచి తన స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడికి వెళ్తుండగా గుండెపోటుతో బస్సులోనే మృతి చెందింది మహిళ. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.