Telangana: డిపెండెంట్ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల గరిష్ట వయో పరిమితిని 35 మంచి 45 ఏళ్లకు పెంచారు. ఈ మేరకు సంస్థ ఉత్తర్వులు జారీ చేసింది.

విధి నిర్వహణలో జరిగే ప్రమాదాల్లో కార్మికుడు దివ్యాంగుడైనా, మరణించినా కారుణ్య నియామకాల్లో వారసులకు ఉద్యోగాలు కల్పిస్తారు. కాగా, డిపెండెంట్ ఉద్యోగాల వయసు పెంపుపై సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు నెరవేరింది. ఈ నిర్ణయంతో… సింగరేణిలో పని చేసే వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.