ముద్రగడకు మరో షాక్.. మా కులంలోకి రావొద్దంటూ రెడ్డి నేతలు నిరసనకు దిగారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే.. పేరు మార్చుకుంటానని సవాల్ విసిరి.. ఇప్పుడు పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు ముద్రగడ పద్మనాభం. నా పేరు పద్మనాభ రెడ్డి గా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నానని ప్రకటించారు. అయితే ఈ వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది.

పద్మనాభరెడ్డిగా పేరు మార్పుకు ముద్రగడ చేసిన ప్రకటనను వ్యతిరేకిస్తున్నట్లు అనపర్తి మండలం కొప్పవరం మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామరెడ్డి ప్రకటించారు. మాకు వద్దు ఈ పద్మనాభ రెడ్డి…. రెడ్డి కులంలో చేరటానికి మీకెవరైనా అనుమతి ఇచ్చారా అంటూ ఆగ్రహించారు కొప్పవరం మాజీ సర్పంచ్ వెంకట రామారెడ్డి. మా రెడ్ల పరువు తీరటానికా ఈ చేరిక అంటూ “ముద్రగడ”కు కొప్పవరం మాజీ సర్పంచ్ వెంకట రామారెడ్డి బహిరంగలేఖ రాశారు.
