అజారుద్దీన్ వర్సెస్ విష్ణు..జూబ్లీహిల్స్ దక్కేదెవరికి?

-

హైదరాబాదులో కొన్ని ప్రత్యేకమైన నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్ ఒకటి. ఇప్పటికే జూబ్లీహిల్స్ బి‌ఆర్‌ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఫిక్స్ అయ్యారు. ఇక జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అని సర్వత్ర చర్చ నడుస్తోంది.  సీనియర్ నాయకుడు పి. జనార్దన్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి గతంలో పోటీ చేసి ఓటమిని పొందారు. ఇప్పుడు కూడా విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క లాంటి సీనియర్ నాయకులతోపాటు, జనార్దన్ రెడ్డి అభిమానులు కూడా విష్ణువర్ధన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు. విష్ణువర్ధన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇస్తారు అని అందరూ అనుకున్నారు.

కానీ అనూహ్యంగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ బరిలో మరో అభ్యర్థి  వచ్చారు. ఆయనే మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్నారు. ఈయనకు రేవంత్ రెడ్డి మద్దతు ఉందని తెలుస్తోంది. అజారుద్దీన్ కనుక జూబ్లీహిల్స్ లో పోటీ చేస్తే కీలకంగా ఉన్న మైనారిటీ ఓట్లు కాంగ్రెస్ సొంతమవుతాయని ఈక్వేషన్స్ చెబుతున్నారు రేవంత్ రెడ్డి. అజారుద్దీన్ కూడా జూబ్లీహిల్స్ లో తన పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ప్రజలతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో విష్ణువర్ధన్ రెడ్డి సన్నిహితులతో కూడా చర్చిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నారు.

కాంగ్రెస్ అధిష్టానం మరి సీనియర్ల పట్టుదల, పలుకుబడికి విలువ ఇచ్చి విష్ణువర్ధన్ రెడ్డి టికెట్ ఇస్తుందా,  రేవంత్ రెడ్డి ఈక్వేషన్స్ కు మద్దతు ఇచ్చి అజారుద్దీన్ కు టికెట్ ఇస్తారా చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news