హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ సమస్య గురించి అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నిన్న నేను, హరీష్ రావు మాట్లాడితే లా అండ్ ఆర్డర్ బాగుంది అని మంత్రి అన్నారు. మళ్లీ నిన్న నగరంలో 3 హత్యలు జరిగాయి. టాస్క్ ఫోర్స్ పోలీసుల పని నేరస్థులను పట్టుకోవడం.. కానీ వాళ్లు రాత్రి పూట సామాన్యుల మీద లాఠీఛార్జ్ చేస్తున్నారు. హైదరాబాద్లో పోలీసులు రాత్రిపూట డ్యూటీలు చేస్తూ పగటి పూట పడుకుంటున్నారు.. హత్యలు పగటిపూట జరుగుతున్నాయని తెలిపారు.
మరోవైపు హైదరాబాదులో అన్ని పోలీస్ స్టేషనుల కు లంచాలు వెళ్తున్నాయి. ఒక ఏసీపీ నాకు ఫోన్ చేసి మీ ఏరియాలో పోలీస్ స్టేషన్ నిర్మాణానికి డబ్బులు సాయం చేయమని అడిగితే.. నేనెందుకు ఇవ్వాలి అని.. మీకు లంచాలు వస్తున్నాయి కదా దానితో కట్టండి అని చెప్పాననని వెల్లడించారు అక్బరుద్దీన్ ఓవైసీ. ఈ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.