గురువులకు పంగనామం పెట్టే లక్షణం మీది అని బీఆర్ఎస్ నేతలపై తెలంగాణ CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఫైర్ అయ్యారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్లు కేసు వేస్తామంటే.. నేను దయాకర్ గారు వెళ్లి ఆరోజు చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణకు ఇచ్చిన అదనపు విద్యుత్ మీద మీరు కోర్టులో కేసు వేయకూడదు.. ఒకవేళ కేసు వేసి తెలంగాణకు ఏమైనా నష్టం జరిగితే.. ఇది తీవ్రంగా పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పాం.
కేసు వేయడానికి వీలు లేదని చెప్పాం. ఆనాడు మేమందరం కలిసి పోయి.. ఏపీ సీఎం తో కేసు వేయడానికి వీలు లేదని కొట్లాడి ఆపించాం. ఆయన ఆయనకు గురువు.. ఈయన ఈయనకు గురువు అంటుండ్రు. గురువులకు పంగనామం పెట్టే లక్షణం మీది. దూప మీద వస్తే.. ఎవడైనా మంచినీళ్లు ఇచ్చినా వాళ్లను గుర్తు పెట్టుకుంటామని చెప్పారు. పదేళ్లు కలిసి పని చేస్తే.. సహచరులుగా ఉన్న మనవాళ్లను మనం అధైర్య పరచాలని ఎక్కడైనా ఉందా..? అధ్యక్ష్యా.. వాళ్లకు తిన్నింటి వాసాలు లెక్కపెట్టే లక్షణం ఉంది. నాకు అట్లాంటి లక్షణం లేదు అని తెలిపారు.