గర్భిణులు, బాలింత పోలీస్ అభ్యర్థులకు అలర్ట్..ఆ సర్టిఫికేట్ ఉంటేనే అనుమతి !

తెలంగాణ రాష్ట్ర గర్భిణులు, బాలింత పోలీస్ అభ్యర్థులకు అలర్ట్. గర్భిణీలు, బాలింతలు, ఎస్సై, కానిస్టేబుల్స్ స్థాయి శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనకున్న తుది రాత పరీక్ష అర్హత పొందాలంటే అండర్ టేకింగ్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది.

వారు తుది రాత పరీక్షలో అర్హత సాధిస్తే ఆ పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు శారీరక సామర్ధ్య పరీక్షలకు హాజరవుతామని లిఖితపూర్వకంగా ధ్రువీకరించాల్సి ఉంటుందని మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ ధ్రువీకరణను ఈ నెల 31 లోపు డీజీపీ కార్యాలయంలోని టీఎస్ఎల్పిఆర్బి ఇన్ వార్డు సెక్షన్ లో నేరుగా ఇవ్వాలని సూచించారు. ధృవీకరణతో పాటు మెడికల్ సర్టిఫికెట్లను తప్పక ఇవ్వాలన్నారు.