తెలంగాణ రాష్ట్ర వాహనదారులకు… సీఎం రేవంత్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ చలాన్ లను… పెంచేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. రవాణా శాఖలో ఆదాయం పెంచుకునేందుకు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వారిపై కొరడా దులిపించేందుకు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
ప్రస్తుతం చలాన్లపై ఐదు నుంచి ఆరు రేట్లు పెంచి… కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇష్టానుసారంగా వాహనాలు నడిపితే… కఠిన చర్యలతో పాటు ఫైన్లు భారీగా వేసేందుకు నిర్ణయం తీసుకుందట రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెల్మెట్ లేకుండా పట్టుబడ్డ వారిపై జరిమానాలు భారీగా విధించేలా కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. దీనిపై అతి త్వరలోనే కీలక ప్రకటన రానున్నట్లు సమాచారం.