వాతావరణ సూచన: నైరుతి రుతుపవనాలు రాగల 2,3 రోజులలో ద్వీపకల్ప దక్షిణ భారతదేశంలోని మరికొన్ని భాగాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా వాయువ్య / పశ్చిమ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నవి. ఈ క్రమంలో రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షములు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు రాష్ట్రంలో వడగాలులు, అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.
రాగల మూడు రోజులు వడగాలులు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న జిల్లాలు.. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వడ గాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో అక్కడక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉంది.