మహబూబ్ నగర్ ఎంపి అభ్యర్థి గా ఎంపిక చేసిన అగ్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు డీకే అరుణ. తాజాగా ఆమె విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో తక్కువ మెజార్టీ తో ఓడాను. బీఆర్ఎస్ కు పోటీలో ఉండేందుకు అభ్యర్థులే కరువయ్యారు. కాంగ్రెస్ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ప్రచారం కు మాత్రమే పరిమితమయ్యాయి. మళ్ళీ ఈ దేశానికి ప్రధాని కాబోయేది నరేంద్ర మోడీ నే అన్నారు.
6 గ్యారంటీలకే దిక్కు లేదు… మహిళ పేరిట రూ.లక్ష ఇస్తాననడం హాస్యాస్పదం అన్నారు. జీతాలివ్వడానికే పైసల్లేవ్.. హామీలెట్లా అమలు చేస్తారు? అని ప్రశ్నించారు. హామీలకు ఆశపడి ఓటేస్తే మోసపోతారు అని తెలిపారు. 6 గ్యారంటీలను అమలు చేసే దాకా కాంగ్రెస్ వెంట పడతాం అని తెలిపారు. గ్రామాలకిచ్చే నిధులన్నీ మోడీ ప్రభుత్వానివేనని తెలిపారు డీకే అరుణ. మహబూబ్ నగర్ నుంచి తాను అధిక మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.