మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు మరో గౌరవప్రదమైన ఆహ్వానం అందింది. అమెరికాలోని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్’కు హాజరు కావాలని కేటీఆర్‌కు ఆహ్వానం వచ్చింది. ఇల్లినాయ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13వ తేదీన జరగబోతున్న ఈ సదస్సులో భారత పారిశ్రామిక రంగంలో నెలకొన్న అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే చర్చలో పాల్గొని ప్రసంగించాలని ఆహ్వాన పత్రికలో యూనివర్సిటీ నిర్వాహకులు కోరారు.
రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రిగా పనిచేసిన నేపథ్యంలో ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి రూపకల్పన చేసిన పాలసీలు, అవి సాధించిన విజయాలను సదస్సులో వివరించాలని కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు యూనివర్సిటీలోని కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ డైరెక్టర్ శ్వేత మేడపాటి లేఖలో విజ్ఞప్తి చేశారు. ఇక ఇటీవలే దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ మద్రాస్‌లో జరుగనున్న ఈ- సమ్మిట్‌లో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. ప్రతి ఏటా నిర్వహించే ఆంత్రప్రెన్యురల్ ఫెస్టివల్ (ఈ-సమ్మిట్)లో కీలకోపన్యాసం చేయాలని ఐఐటి మద్రాస్ కేటీఆర్‌ను కోరింది.