అధికారంలోకి రాగానే కేసీఆర్​ను జైలుకు పంపిస్తాం : అమిత్ షా

-

వచ్చే ఎన్నికలు రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను నిర్ణయిస్తాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. వల్లభాయ్ పటేల్ కృషి వల్ల రజాకార్ల నుంచి విముక్తి పొందామని తెలిపారు. ఓవైసీకి భయపడి కేసీఆర్‌ విమోచన దినోత్సవాల జరపడం లేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అధికారికంగా జరుపుతామని హామీ ఇచ్చారు. భైరాన్​పల్లిలో అమరవీరుల కోసం స్మారక స్తూపాన్ని నిర్మిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాల నిర్మిస్తామని చెప్పి కేసీఆర్ సర్కార్.. దాన్ని మరిచి భూ కబ్జా ల్లో మునిగి తేలుతోందని ఆరోపించారు. జనగామలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో అమిత్ షా ప్రసంగించారు.

“కేసీఆర్, కాంగ్రెస్​లు కుటుంబ పార్టీలు. బీజేపీ తెలంగాణ పార్టీ. మోదీ హయాంలో దేశం ఖ్యాతి విశ్వ వ్యాప్త మైంది. కొత్త పార్లమెంట్ నిర్మించి.. మోదీ దేశం గర్వించేలా చేశారు. మోదీ హయాంలో. చంద్రయాన్ విజయవంతమై.. దేశ ఖ్యాతిని ఇనుమడింప చేసింది. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి చేస్తాం. ఎస్సీలకు న్యాయం చేస్తాం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం. అవినీతిలో కేసీఆర్ సర్కార్ నంబర్ వన్ స్థానంలో ఉంది. మేం అధికారంలోకి రాగానే కేసీఆర్​ను జైలుకు పంపడం ఖాయం” అని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news