తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఎలాగైనా సీఎం కేసీఆర్ను గద్దెదించాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది. ఈ క్రమంలో జాతీయ నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 27న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
అమిత్ షా పర్యటన షెడ్యూల్
ఈ నెల 27న దిల్లీ నుంచి మధ్యాహ్నం 1.25 గంటలకు గన్నవరం ఎయిర్పోర్టుకు అమిత్ షా
గన్నవరం నుంచి హెలికాప్టర్ లో 2.10 గంటలకు కొత్తగూడెం వెళ్లనున్న అమిత్ షా
కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం పర్యటన..
2.25 నుంచి 2.40 గంటల వరకు భద్రాద్రి రాముడికి ప్రత్యేక పూజలు
భద్రాచలం నుంచి రోడ్డు మార్గాన కొత్తగూడెం వెళ్లనున్న అమిత్ షా
కొత్తగూడెం నుంచి 2.55 గంటలకు బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో బయలుదేరి 3.30 గంటలకు ఖమ్మం చేరుకోనున్న షా
3.45 నుంచి 4.45 గంటల వరకు గంట పాటు రైతు గోస-బీజేపీ భరోసా సభలో పాల్గొననున్న షా
బహిరంగ సభ తర్వాత గంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం.
సాయంత్రం 5.45 గంటలకు హెలికాప్టర్లో గన్నవరానికి బయల్దేరనున్న అమిత్ షా
సాయంత్రం 6.20 గంటలకు దిల్లీకి తిరుగు ప్రయాణం