బేగంపేట ఎయిర్ పోర్ట్ లో రైతులతో అమిత్ షా సంచలన వ్యాఖ్యలు

-

బిజెపి అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సికింద్రాబాద్ చేరుకున్న అమిత్ షా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసిన అనంతరం సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ లోని పార్టీకి చెందిన సామాన్య కార్యకర్త ఎన్. సత్యనారాయణ నివాసానికి వెళ్లారు షా. కార్యకర్త ఎన్ సత్యనారాయణ ను పరామర్శించిన అనంతరం.. తిరిగి మళ్లీ బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణకు చెందిన పలువురు రైతులతో సమావేశం అయ్యారు అమిత్ షా.

ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయం, ప్రభుత్వాల నుంచి అందుతున్న సాయం తదితర అంశాలపై ఆయన రైతులను అడిగి తెలుసుకున్నారు. గో ఆదారిత సాగు చేయాలని రైతులకు సూచించారు అమిత్ షా. తాను కూడా 150 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. విద్యుత్ చట్టం పై అమిత్ షా దగ్గర రైతుల ప్రస్తావించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపునకు సంబంధించి రైతులు అమిత్ షా వద్ద ప్రస్తావించారు. రైతుల వినతికి స్పందించిన అమిత్ షా మార్చాల్సింది చట్టం కాదు.. ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చండి అంటూ సమాధానం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news