సర్దార్ పటేల్ లేకుంటే.. తెలంగాణకు విముక్తి లభించేది కాదు – అమిత్‌ షా

సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ కి విముక్తి లభించేది కాదన్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. హైదరాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మాట్లాడుతూ…హైదరాబాద్ విమోచన దినోత్సవ శుభకాంక్షలు చెప్పారు.

అమరులకు శిరస్సు వంచి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. సర్దార్ పటేల్ కు నివాళులు అర్పిస్తున్నామని.. సర్దార్ పటేల్ లేకుంటే తెలంగాణ కి విముక్తి లభించేది కాదన్నారు. సర్దార్ పటేల్ పోలీస్ యాక్షన్ కి రూప కల్పన చేశారని పేర్కొన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన ప్రముఖుల పేర్లని ప్రస్తావించిన షా… 75 ఏళ్ల వరకు ఈ విముక్తి దినం నీ ఏ ప్రభుత్వం నిర్వహించలేదని ఆగ్రహించారు. మోడీ సర్కార్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఇక్కడ విమోచన ఉత్సవాలు నిర్వహించడం లేదని చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.