తెలంగాణ రైతులకు శుభవార్త.. మరో 1.50 లక్షల మందికి రైతుబంధు వర్తింపు

-

తెలంగాణ రైతులకు శుభవార్త.. మరో 1.50 లక్షల మందికి రైతుబంధు వర్తింపు చేయనుంది కేసీఆర్‌ సర్కార్‌. ఈ నెల 26న రైతుబంధు నిధులను విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిన్న ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న 65 లక్షల మంది లబ్ధిదారులతో పాటు… కొత్తగా పోడు భూముల పట్టాలు పొందనున్న 1.50 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు.

ఈ నెల 24 నుంచి పోడు పట్టాల పంపిణీ జరగనుండగా… పట్టాలు పొందిన వారికి రైతుబంధు అందేలా చర్యలు తీసుకోనున్నారు. రైతుబంధు కింద ఎకరానికి రూ. 5వేలు పెట్టుబడి సాయంగా అందిస్తారు. కాగా, వానాకాలం పంట(ఖరీఫ్‌) తాలూకూ రైతుబంధు నిధులను ఈ నెల 26 నుంచి విడుదల చేయాలని నిర్ణయించింది. గతంలో మాదిరిగానే అన్నదాతల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమ చేయాలని సోమవారం రోజున సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటివరకు ఉన్న 65,00,588 మంది లబ్ధిదారులతోపాటు, కొత్తగా పోడు భూముల పట్టాలు పొందనున్న 1,50,012 మంది రైతులకూ రైతుబంధు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news