యోగా దినోత్సవం సందర్భంగా జీ తెలుగులో ప్రత్యేక ఎపిసోడ్ ఆరోగ్యమే మహాయోగం.. ఈ బుధవారం ఉదయం 8:30 గంటలకు ప్రసారం

-

హైదరాబాద్, 19 జూన్: వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందించే ప్రత్యేక కార్యక్రమాలతో అలరిస్తోన్న ఛానల్ జీ తెలుగు. ప్రతిరోజు ‘ఆరోగ్యమే మహాయోగం’ కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవనానికి కావలసిన సలహాలు, సూచనలు అందిస్తోంది. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఎపిసోడ్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తేజస్విని మనోజ్ఞ అందించే ఆరోగ్య రహస్యాలతోపాటు పలు యోగాసనాలు, మంతెన సత్యనారాయణ ప్రత్యేక సూచనలతో ఈ ఎపిసోడ్ ఆద్యంతం ఉపయుక్తంగా ఉండనుంది. ప్రముఖ గాయకుడు మనో హాజరుకానున్న ఆరోగ్యమే మహాయోగం యోగా డే స్పెషల్ ఎపిసోడ్, జూన్ 21 బుధవారం, ఉదయం 8:30 గంటలకు, మీ జీ తెలుగులో!

ఆరోగ్యవంతమైన జీవనానికి అవసరైన విశేషాలతో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో యోగా దినోత్సవం సందర్భంగా యోగా గురువు డాక్టర్ తేజస్విని మనోజ్ఞ తన ఆరోగ్య రహస్యాలను పంచుకోవడమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యానికి తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారు. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవనశైలికోసం తన దినచర్యను ఎలా ప్లాన్ చేసుకుంటారో, తన ఆహారపు అలవాట్లు, క్రమం తప్పకుండా చేసే పనులు, డైట్ప్లాన్, అభిరుచులు, అలవాట్లను ప్రేక్షకులతో పంచుకుంటారు.

జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంతోపాటు ప్రపంచ సంగీత దినోత్సవం పురస్కరించుకుని జీ తెలుగు సక్సెస్ఫుల్ రియాలిటీ షో సరిగమప సింగర్స్ మనీషా, శశాంక్, సింధుజ ఈ కార్యక్రమంలో పాల్గొని చక్కని పాటలతో అలరిస్తారు. అంతేకాదు తేజస్విని కూడా పాట పాడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ గాయకుడు మనో ప్రేక్షకులతో తన ఆహారపు అలవాట్లను పంచుకుంటారు. వాటిలో ఏవి మంచివో, ఏవి చెడ్డవో కూడా వివరిస్తారు. తనతో ఆరు నెలలు సహవాసం చేస్తే మంతెన సత్యనారాయణ కూడా మంచి గాయకుడు అవుతారంటూ నవ్వులు పూయిస్తారు. మంతెన సత్యనారాయణ సాయంతో పలు ఆసనాలను కూడా వేస్తారు మనో. కార్యక్రమం చివర్లో ఐదుగురు శాస్త్రీయ నృత్యకారులు యోగ నాట్య ప్రదర్శనతో ఆకట్టుకుంటారు. ఈ సందర్భంగా యోగ నాట్యం/నాట్య యోగా ప్రాముఖ్యతను వివరిస్తారు తేజస్విని.

Read more RELATED
Recommended to you

Latest news