తెలంగాణ ప్రజలకు శుభవార్త..రాష్ట్రంలో మరో 100 డయాలసిస్ సెంటర్లు

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో మరో 100 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి హరీష్‌ రావు చెప్పారు. మంథని పట్టణంలోని 50 పడకల మాతాశిశు సంక్షేమ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం, ఏర్పాటు చేసిన సభలో మహనీయులు ఆచార్య శ్రీ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి మంత్రి హరీష్ రావు గారు పూలమాలతో నివాళులు అర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ఏడు కోట్ల రూపాయలతో మంథని ప్రభుత్వ ఎంసీహెచ్ ఆసుపత్రిని నిర్మించుకున్నట్లు చెప్పారు. అదే విధంగా రాష్ట్రంలో 100 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచిత డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నట్లు మంత్రి వెల్లండించారు. ప్రభుత్వం ఎంసీహెచ్ హాస్పిటల్ తీసుకురావడం ద్వారా 60 శాతం ప్రభుత్వ హాస్పిటల్ లో డెలివరీ అవుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్యం అందించడమే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశయమన్నారు. పేదలకు వైద్యం అందించే విషయంలో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉంది కేంద్ర ప్రభుత్వం వెల్లడించినట్లు తెలిపారు.

కేరళ, తమిళనాడు తర్వాత పేదల ఆరోగ్య విషయంలో నాణ్యమైన వైద్యం అందిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ దేశంలోనే మూడో స్థానంలో ఉందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న బీజేపీ అధికారంలో ఉన్న యూపీ ఆరోగ్య సంచికలో చిట్టచివరి స్థానంలో ఉందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప అభివృద్ధి చేయడం చేతకాదని మండిపడ్డారు. కాళేశ్వరం లాంటి మెగా ప్రాజెక్టు కేవలం తెలంగాణ రావడం వల్లనే పూర్తి అయిందని, ఈ కాంగ్రెస్, బీజేపీ పార్టీల వల్ల కానే కాకపోవన్నారు. నిరుద్యోగ యువతను కేంద్రంలో ని బీజేపీ సర్కార్ మోసం చేస్తుందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news