సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనతికాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో రవితేజ కూడా ఒకరు. ముఖ్యంగా రవితేజ, చిరంజీవి, శ్రీకాంత్, నాని వంటి హీరోలు ఎవరి సపోర్టు లేకుండా కేవలం తమ సొంత కాళ్లపై నిలబడి ప్రస్తుతం స్టార్ హీరో లుగా ఎదిగారు అని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఇండస్ట్రీలోకి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకోవాలని అనుకున్న రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి, ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలలో నటించి.. దర్శకులను మెప్పించి చివరికి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక గత ఏడాది మొదట్లో క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అని చెప్పవచ్చు.
ఇక పోతే ఆ తర్వాత వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్లకు సైన్ చేస్తూ ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే..మరో చిత్రానికి సెట్స్ మీదకు తీసుకొస్తూ చాలా బిజీగా తన షెడ్యుల్ ని గడుపుతున్నారు రవితేజ. ఇకపోతే ప్రస్తుతం ఈయన చేతిలో ఐదు సినిమాలు ఉండగా మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రవితేజ ఒప్పుకుంటే భారీ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా ప్రొడ్యూసర్స్ వెనకాడటం లేదు అని సమాచారం. ఇకపోతే రవితేజ ఒక్క సినిమాకు పారితోషికంగా రూ.20 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇకపోతే గత చిత్రం ఖిలాడి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలినప్పటికీ ఈ హీరో డిమాండ్ తగ్గక పోవడానికి కారణం నాన్ థియేట్రికల్ మార్కెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా హిందీ మార్కెట్లో రవితేజ కు మంచి గుర్తింపు ఉంది . ముఖ్యంగా ఈయన సినిమాలు టీవీ చానల్స్ లో మంచి టీఆర్పీ కూడా రాబడుతుంటాయి. యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ కూడా సాధిస్తున్నాయి. ఇక ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నాడు. ఇక మరొకవైపు రావణాసుర సినిమా షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు.. చెప్పుకుంటూ పోతే ఈయన వరుస సినిమాలతో షూటింగ్లో బిజీగా ఉన్నట్లు సమాచారం.