తెలంగాణలో మ‌రో 185 కరోనా కేసులు ఒక‌రు మృతి

తెలంగాణ రాష్ట్రం లో క‌రోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్రంలో 185 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రం లో మొత్తం కేసుల సంఖ్య 6.79,430 కి చేరింది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హమ్మారి బారిన ప‌డి ఒక‌రు మృతి చెందారు. దీంతో రాష్ట్రం లో క‌రోనా బరిన ప‌డి మృతి చెందిన వారి సంఖ్య 4,014 కు చేరింది. అలాగే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం గా 205 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు.

corona
corona

అలాగే రాష్ట్రం లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,761 ఉంది. అలాగే గ‌డిచిన 24 గంట‌ల‌లో రాష్ట్రంలో మొత్తం 41,484 శాంపిల్స్ ను టెస్ట్ చేశారు. అలాగే 4, 875 శాంపిల్స్ రిజ‌ల్ట్ పెండింగ్ లో ఉన్నాయి. కాగ తెలంగాణ లో కరోనా పాజిటివ్ రిక‌వ‌రీ రేటు దాదాపు 98.85 శాతం గా ఉంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే రాష్ట్రం లో ఈ రోజు 12 ఓమిక్రాన్ కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర ప్ర‌జ‌లు క‌రోనా, ఓమిక్రాన్ ప‌ట్ల జాగ్ర‌త్త గా ఉండాలని, కరోనా నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచించారు.