దేశంలో ఓమిక్రాన్ పంజా విసురుతుంది. రోజు రోజు కు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తాజా గా మరో 8 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. ఈ 8 ఓమిక్రాన్ కేసులు మహారాష్ట్ర లో నే నమోదు అయ్యాయి. అయితే మహారాష్ట్ర లో ఓమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరుల పాకుతుంది. మహారాష్ట్ర లో ప్రతి రోజు ఓమిక్రాన్ కేసులు నమోదు అవుతున్నాయి. మహారాష్ట్ర లో వెలగు చూసిన ఈ 8 ఓమిక్రాన్ కేసు లతో దేశం మొత్తం గా 123 కు ఓమిక్రాన్ కేసుల సంఖ్య చేరుకుంది.
అయితే ప్రజలు అప్రమత్తం గా లేకపోవడం వల్లే రోజు రోజుకు ఓమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్య ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. మహా రాష్ట్ర లోనే కాకుండా మొత్తం దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ 11 రాష్ట్రాల కు పాకింది. దీంతో దేశ వ్యాప్తం గా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఓమిక్రాన్ వేరియంట్ కట్టడికి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అవుతున్నారు. కాగ ప్రజలు కరోనా నిబంధనలు సక్రమం గా పాటిస్తే కేసుల సంఖ్య తక్కువ అయ్యే అవకాశం ఉందని పలువురు అధికారులు అంటున్నారు.