బూతులు మాట్లాడే వారికి బూత్ లోనే సమాధానం చెప్పండి : వెంకయ్య నాయుడు

-

పద్మవిభూషణ్‌ పురస్కారాలకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిని సీఎం, మంత్రులు సన్మానించారు. వారితో పాటు పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు   ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. బూతులు మాట్లాడే ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ఇటీవల రాజకీయాల్లో ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. నేతలు బూతులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వారికి పోలింగ్ బూత్ లోనే ప్రజలు తగిన సమాధానం చెప్పాలన్నారు. లోపల బటన్ నొక్కితే ఫినిష్.. కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం, భాష పేరుతో జనాన్ని చీల్చే వారికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. తన జీవితంలో అవార్డులను పెద్దగా తీసుకోలేదని వెంకయ్యనాయుడు తెలిపారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. 4 కిలోమీటర్లు నడిచి స్కూల్ కి వెళ్లి అంచెలంచెలుగా ఎదిగిన నన్ను కేంద్రం గుర్తించినందుకు గౌరవంగా పద్మవిభూషణ్ ను స్వీకరిస్తున్నానని తెలిపారు వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news