తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం నియమించిన ఏడుగురు సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ సీఎం శాంతి కుమారి ఉత్వర్వులను జారీ చేశారు. దీంతో విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సోమేష్ కుమార్, రాజీవ్ శర్మ, ఏ.కే.ఖాన్, జీ.ఆర్.రెడ్డి, అనురాగ్ శర్మ, చెన్నమనేని రమేష్, ఆర్.శోభ సలహాదారులుగా పదవులను కోల్పోయారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సలహాదారులుగా కొత్తవారిని నియమించే అవకాశాలున్నాయి. ఎవరెవరినీ నియమిస్తారు..? ఎప్పుడు నియమిస్తారనే విషయం మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే ఓ క్లారిటీ రానుంది. ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయకముందే డీజీపీ రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎన్నికల కమిషన్ డీజీపీని సస్పెండ్ చేశారు. కొత్త డీజీపీని ఏర్పాటు చేశారు. ఆ డీజీపీని మళ్లీ రేవంత్ రెడ్డి నియమిస్తారని పలువురు చర్చించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి నియమిస్తారా లేదా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.