తాను బతికి ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్ గా ఉంటుందని నిర్మల్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జబ్ తక్ కేసీఆర్ జిందా రహేగా, తబ్ తక్ తెలంగాణ సెక్యులర్ రియాసత్ రహేగా అని నినదించారు. కులమతాలతో సంబంధం లేకుండా రాష్ట్రంలో అర్హలైన వారందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వివరించారు సీఎం కేేసీఆర్.
ముఖ్యంగా ఆయా పార్టీల అభ్యర్థుల మంచి, చెడు తెలుసుకోవాలి. అభ్యర్థులు గెలవడంతో ప్రభుత్వం ఏర్పడతుంది. ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభమేనేది చర్చ జరగాలి. ప్రతి పార్టీ చరిత్ర చూడాలి. ఆయా పార్టీల హాయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. పార్టీ వైఖరి తెలుసుకోవాలి. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తది.. నడవడి ఎట్ల ఉన్నది అనేది గమనించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తరు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలుస్తే మీ కోరికలు నెరవేరుతాయి అని కేసీఆర్ పేర్కొన్నారు.