కమ్యూనిస్ట్‌ పార్టీలతో పొత్తుపై స్పందించిన కోమటిరెడ్డి

-

కాంగ్రెస్-కమ్యూనిస్టులపై పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కమ్యూనిస్టులకు సీట్లు ఇచ్చేది లేదు. సీట్లే కావాలంటే మేం పొత్తులకు వ్యతిరేకం.కావాలంటే గెలిచిన తర్వాత చెరో ఎమ్మెల్సీ ఇస్తం, అధిష్టానం ఒప్పుకుంటే చెరో మంత్రి పదవి ఇస్తామని కుండబద్దలు కొట్టారు. ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల పొత్తులపై తేల్చిపడేశారు వెంకట్ రెడ్డి.

తెలంగాణలో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి అటిటు కాకుండా అయిపోయింది. మునుగోడు ఉపఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న కమ్యూనిస్టులు, రిజల్ట్స్ తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో మీరు గెలవడం కష్టం.. కాబట్టి చెరో రెండు ఎమ్మెల్సీలు ఇస్తాం.. సపోర్ట్ చేయండి అని బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించి కాంగ్రెస్ తో పొత్తుకోసం వెళ్లారు. కమ్యూనిస్టుతో పొత్తు పెట్టుకుంటామని చెప్పుకుంటూ వస్తున్న కాంగ్రెస్ తీరా నామినేషన్ల సమయం వచ్చేసరికి హ్యండ్ ఇచ్చింది. మేము కూడా చెరో ఎమ్మెల్సీ ఇస్తామని.. మేం అధికారంలోకి వస్తే.. మా అధిష్టానం ఒప్పుకుంటే మంత్రి పదవులు ఇస్తమని చావు కబురు చల్లగా చెప్పింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాటలతో కాంగ్రెస్ మనోగతం ఏంటో కమ్యూనిస్టులకు అర్థమైపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news