తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతను ప్రకటించారు. తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా ఎస్. మధుసూధనాచారిగా ఫైనల్ అయ్యారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. అటు తెలంగాణ అసెంబ్లీ ప్రతి పక్షనేతగా కేసీఆర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. ప్రస్తుతం పీఏసీగా అరికేపూడి గాంధీని నియామకం చేయడంపై రచ్చ మొదలైంది.
అటు తెలంగాణ రాష్ట్రంలో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తూ.. తాజాగా తెలంగాణ శాసనసభ ఉత్వర్వులను జారీ చేసింది. ఎస్టిమేషన్ కమిటీ చైర్ పర్సన్ గా కోదా డ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీకి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్య, పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నియమితులయ్యారు. ఈ కమిటీలలో మొత్తం 12 మంది చొప్పున సభ్యులుగా ఉండనున్నారు.