తెలంగాణ తల్లిపై రచ్చ జరుగుతోంది. ఇవాళ్టి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉన్న తరుణంలో… బీఆర్ఎస్ వినూత్న నిరసనలకు దిగింది. తెలంగాణ తల్లి మాది కాంగ్రెస్ తల్లి నీది అంటూ నినాదాలు అంటూ నినాదాలు చేశారు. బతకమ్మ తీసి చేయి గుర్తు పెట్టిందంటూ నినాదాలు చేస్తున్నారు. అటు అదాని రేవంత్ దోస్తీ పైన టిఆర్ఎస్ పార్టీ వినూత్న నిరసన చేస్తున్నారు.
ఆదాని రేవంత్ భాయి భాయి అంటూ టీ షర్టులతో గన్ పార్క్ నుంచి అసెంబ్లీకి బయలుదేరారు పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. ఢిల్లీలో అదానితో కుస్తీ గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినడం లేదు అని మాకు టి షర్ట్ లతో అసెంబ్లీ లో నిరసన తెలియజేయమన్నారటూ కేటీఆర్ చురకలు అంటించారు.
గన్ పార్క్ వద్ద BRS నేతలు pic.twitter.com/GKEd9jdT7g
— Sarita Avula (@SaritaAvula) December 9, 2024