హైదరాబాద్ లో దారుణం.. ఆస్తి కోసం బావమరిదిని చంపించిన బావ..!

-

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్తి కోసం బావమరిదిని చంపించాడు బావ. వివరాల్లోకి వెళ్లితే.. ఏపీలోని కావలికి చెందిన శ్రీకాంత్ హైదరాబాద్ గచ్చిబౌలిలోని పీజీ హాస్టల్ నిర్వహిస్తుంటాడు. క్రికెట్ మ్యాచ్  బెట్టింగ్ ఆడి ఐదు కోట్లు నష్టపోయాడు శ్రీకాంత్. అప్పుల్లో మునిగిపోయిన శ్రీకాంత్ కి అత్తింటి ఆస్తి పై కన్ను పడింది. హాస్టల్ కి మంచి నమ్మకస్తుడు కావాలని అత్త, మామకు చెప్పి బావమరిదిని తీసుకువచ్చాడు శ్రీకాంత్.

ఇక బామ్మర్ది యశ్వంత్ ను అడ్డు తొలగించుకుంటే మామ ఆస్తి సొంతమవుతుందని  భావించాడు. సుపారి గ్యాంగ్ కి డబ్బులు ఇచ్చి బామ్మర్దిని చంపించాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి..  తన మామకు సమాచారం ఇచ్చాడు. బావమరిది చెడు వ్యసనాల అలవాటుపడ్డాడు అంటూ ఆరోపణలు చేశాడు. హత్య చేయింసి ఆత్మహత్య గా సృష్టించి మృతదేహాన్ని అప్పగించాడు.  హాస్టల్లో ఉన్న సీసీటీవి ఫుటేజ్ హత్య జరిగిన రోజుకి సంబంధించిన డేటా డిలీట్ కావడంతో అతని పై అనుమానం కలిగింది. మరోవైపు చనిపోయిన వ్యక్తిపై గాయాలు ఉండడంతో అనుమానం వచ్చి అత్త,మామ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇది ఒక సుపారి గ్యాంగ్ తో హత్య చేయించినట్టు నిర్థారణ అయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version