తెలంగాణలో ఇంకా పూర్వ కాలం సంఘటనలే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా దొరల పాలనలో జరిగిన అరాచకాలు నేటికి అక్కడక్కడ ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. రోజు రోజుకు కులం, మతం అంటూ తారతమ్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే దళితులను దారుణంగా హింసిస్తున్నారు. దళిత మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నారు.
తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. జామకాయలు తెంపుతున్నాడని దళిత మైనర్ బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టారు. రంగారెడ్డి-షాబాద్ మండలం కేసారం గ్రామంలో మధుసూధన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఉన్న జామ చెట్టుకు జామ పండ్లు తెంపుతున్నాడని దళిత బాలుడిని కాళ్లు, చేతులు కట్టేసి కొట్టాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మధుసూధన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు దళిత సంఘాల నేతలు పేర్కొంటున్నారు.