మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం..కాన్వాయ్‌పై కోడిగుడ్ల తో దాడి

-

ఇబ్రహీంపట్నం టీఆరెస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఏకంగా.. ఆయన కాన్వాయ్‌ పై కోడిగుడ్ల తో దాడితో దాడి చేశారు. ఆయన క్యాంప్ ఆఫీస్ నుండి హైదరాబాద్ వెళ్తుండగా అంబెడ్కర్ చౌరస్తా వద్ద టీఆరెస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని.. కాంగ్రెస్ నాయకులు అడుకున్నారు. ఒక్క సారి గుంపులుగా వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు, ఎన్‌ ఎస్‌ యూఐ నేతలు ఆయన కాన్వాయ్‌ పై దాడి చేశారు.

ఈ నేపథ్యంలోనే ఆయన కాన్వాయ్‌ పై కోడిగుడ్ల తో దాడితో దాడి చేశారు. టీఆరెస్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడి సమయంలో నిన్న కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టారు టీఆరెస్ పార్టీ కార్యకర్తలు. అయితే.. తమ పై దాడి చేసిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటూ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని నిలదీశారు nsui నేతలు. ఇందులో భాగంగానే కోడిగుడ్లతో నిరసన తెలిపారు. అయితే.. Nsui నాయకులను అడ్డుకొని టీఆరెస్ నాయకులు.. చిత్తగొట్టారు. దీంతో సాగర్ హై వే పై పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news