తెలంగాణలో 18కి చేరిన ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు

-

తెలంగాణ రాష్ట్రంలో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్‌ ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోగా.. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ పథకంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నారు.

అయితే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు ఆందోళన చేపడుతున్నప్పటికీ… కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ప్రచారం ఉంది. ఈ తరుణంలోనే…భద్రాద్రి కొత్తగూడెంలో మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం బుచ్చన్నగూడెం గ్రామానికి చెందిన తోడేటి రామలింగయ్య (33) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో రామలింగయ్య గ్రామ శివారులోని పామాయిల్ తోటలో పురుగుల మందు ఆత్మహత్య చేసుకోగా మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. తాజాగా జరిగిన సంఘటనతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు 18కి చేరాయి.

Read more RELATED
Recommended to you

Latest news