ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని బీజేపీ నేత బాబు మోహన్ ప్రకటించారు. తనకు మొదటి లిస్ట్ లో పేరు రాకపోవడంపై బీజేపీ నేత బాబు మోహన్ స్పందించారు.ఈ సారి ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదన్నారు బీజేపీ నేత బాబు మోహన్. పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బీజేపీ నేత బాబు మోహన్… తనకు మొదటి లిస్ట్ లో టిక్కెట్ ఇవ్వకపోవడం తో అసంతృప్తి వెళ్లగక్కారు. పార్టీ అధ్యక్షులకు ఫోన్ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించడం తో తీవ్ర అసహనానికి గురయ్యారు బీజేపీ నేత బాబు మోహన్.
త్వరలోనే పార్టీ తన విషయంలో ఇచ్చే స్పందనను బట్టి… పార్టీలో ఉండాలా లేదా అని తేల్చుకుంటానన్నారు. భవిష్యత్ లో తుది నిర్ణయం తీసుకుంటానని చెప్పారు బీజేపీ నేత బాబు మోహన్. సోషల్ మీడియాలో నా కొడుకుకు… నాకు మధ్య టికెట్ కోసం పోటీ నెలకొందని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆగ్రహించారు. ఇది సరి కాదన్నారు. ఆందోల్ ప్రజలు నన్ను మూడు సార్లు ఆదరించారని వెల్లడించారు. మోడీ గారు మంచి నాయకుడు కానీ ఇక్కడి నేతల తీరు మాత్రం సరిగ్గా లేదని ఫైర్ అయ్యారు బీజేపీ నేత బాబు మోహన్.