కేంద్ర ప్రభుత్వంపై మరో పోరాటం చేయడానికి తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ సిద్ధం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డ తర్వాత.. వచ్చిన విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఏర్పాటు గురించి కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తు.. నిరసన దీక్ష చేయనున్నారు. కాగ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి బయ్యారం ఉక్కు పరిశ్రమ డిమాండ్ ఉంది.
కాగ బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి అధ్యయానం చేయడానికి కేంద్రం నుంచి చాలా సార్లు.. సర్వే చేయడానికి బయ్యారానికి వచ్చారు. పరిశ్రమ ఏర్పాటుకు స్థలం, ఉక్కు రాయి, నీరు, విద్యుత్, రైల్వే లైన్ వంటి సదుపాయాలపై సర్వే చేశారు. అయితే ఇక్కడ ఇనుప రాయి నాణ్యతలో లోపం ఉందని ఉక్కు పరిశ్రమపై కేంద్రం చెతులెత్తేసింది. తాజా గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బయ్యారం ఉక్కు పరిశ్రమ ఇక రాదని ప్రకటన చేశారు.
దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. అందులో భాగంగానే నేడు బయ్యారం ఉక్కు నిరసన దీక్ష చేయనున్నారు. ఈ దీక్షలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కవిత తో పాటు పలువురు ఎమ్మెల్యే లో పాల్గొననున్నారు.